: నెట్టింట వైరల్ అవుతున్న 'మూడు కాళ్ల అమ్మాయి' ఫోటో... మీరూ చూసి అసలు విషయం తెలుసుకోండి!
"ఈ ఫోటోలో ఓ తేడా ఉంది... అదేంటో కనుక్కోండి" అని ఓ నెటిజన్ పోస్టు చేసిన ఫోటో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఓ అందమైన యువతి ఎర్రటి తివాచీ మీద కూర్చుని ఉండగా, ఆమెకు మూడు కాళ్లు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండటమే ఈ ఫోటో ఇంతలా హల్ చల్ చేయడానికి కారణం. ఇక ఈ ఫోటోలో ఉన్న అసహజత్వం ఏంటో తెలుసుకోవాలంటే, ఫోటోను మరింత తేరిపారా చూస్తూ, నిశితంగా పరిశీలించాల్సిందే. ఆమెకు రెండు కాళ్లే ఉన్నాయని, ఓ కుండను ఆమె పట్టుకుని కూర్చుండగా, అద్భుత కెమెరా పనితనం మూడు కాళ్లు ఉన్నట్టు భ్రమించేలా చేస్తోందని నెటిజన్లు పసిగట్టారు. ఆ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.