: పేలిన ఫ్రిడ్జ్... ఇల్లు ధ్వంసం!
హైదరాబాదులోని కర్మన్ ఘాట్ లో ఉన్న సాయినగర్ కాలనీలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలడంలో, ఇంటి గోడకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసమయింది. పోలీసుల వివరాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ పేలుడు సంభవించింది. మరోవైపు, పేలుడు శబ్దం విన్న చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.