chandrababu: పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీరు విడుదల చేసి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రమంత్రులు ఉమా మహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, పలువురు ప్రభుత్వాధికారులు ఉన్నారు. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు అక్కడ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన వేదికపై ప్రసంగిస్తారు.