: నేడే ముహూర్తం... కాంగ్రెస్ లోకి నవజ్యోత్ సింగ్ సిద్ధూ


మాజీ క్రికెటర్, గత సంవత్సరంలో బీజేపీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో నేడు చేరనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ బహిరంగ సభను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. అమృతసర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగుతారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 40 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఇప్పటికే రాహుల్ ఫైనలైజ్ చేయగా, ఇంతవరకూ 77 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మొత్తం 117 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో మరో 40 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కావాల్సి వుంది. గత సంవత్సరం సెప్టెంబర్ 14న సిద్ధూ, అనూహ్య రీతిలో బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన భార్య కూడా బీజేపీకి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News