pokemon go: ‘పోకెమాన్'.. గో.. మా దేశం రావద్దు!: చైనా
‘పోకెమాన్ గో’ విడుదలయిన తరువాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని, ఆటఆడిన ఎంతోమంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రమాదాలను కొనితెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ తెచ్చిపెడుతున్న చిక్కుల కారణంగా ఎంతో మంది దానిపై ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, తాజాగా స్మార్ట్‌ఫోన్, ఆన్లైన్ గేమింగ్ మార్కెట్లో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న చైనాలో ఆ గేమ్‌కు అనుమతులు రాలేదు. యూజర్ల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే గేమ్‌లకు తాము అనుమతి ఇవ్వబోమని చైనా అధికారులు పేర్కొన్నారు. ఈ గేమ్‌లోని ప్రమాదకర ఫీచర్లను తొలగిస్తే మాత్రం ఆలోచిస్తామని చెప్పారు. దీంతో ‘పోకెమాన్ గో’ స్మార్ట్‌ఫోన్ గేమ్‌కు చైనా యూజర్లకు అందకుండా పోతోంది.