: కుమారుడి కోసం అంజనా దేవి, భర్త కోసం సురేఖ... కదిలొచ్చిన వేళ!
చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'ని అభిమానుల మధ్య చూసేందుకు మెగా ఫ్యామిలీ కదిలొచ్చింది. హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటరులో సినిమాను వీక్షించేందుకు చిరంజీవి తల్లి అంజనాదేవి, భార్య సురేఖలు వచ్చారు. వీరితో పాటు హీరో అల్లు అర్జున్ తన సతీమణితో కలసి వచ్చారు. థియేటర్ వద్ద వీరిని చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు.
"బాస్ ఈజ్ బ్యాక్", "స్టైలిష్ స్టార్" అంటూ నినాదాలు చేశారు. వీరిని థియేటర్ లోకి పంపేందుకు పోలీసులు, బౌన్సర్లు నానా ఇబ్బందులూ పడాల్సి వచ్చింది. అంతకుముందు అభిమాన సంఘాల ఆధ్వర్యంలో థియేటర్ లో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. బాణసంచా కాల్చి అభిమానులు పండగ వాతావరణాన్ని సృష్టించారు.