: దేవిశ్రీ బావను ప్రశంసించిన చిరంజీవి!


చిరంజీవి ల్యాండ్ మార్క్ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ఆడియో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'నీరు' అనే పాట మనసులను హత్తుకునేలా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ పాట లిరిక్స్ తో పాటు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా శభాష్ అనిపించింది. ఈ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన స్కెచెస్ కూడా అభిమానుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ స్కెచెస్ వేసింది మరెవరో కాదు... దేవిశ్రీ ప్రసాద్ బావ వివేక్. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ తన బావను సోషల్ మీడియాలో పరిచయం చేశాడు. అంతేకాదు, వివేక్ స్కెచెస్ కి చిరంజీవి కూడా ఇంప్రస్ అయ్యారని... వివేక్ ను ఆశీర్వదించారని చెప్పాడు.

  • Loading...

More Telugu News