: సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనిలో అగ్నిప్రమాదం.. రూ.కోటి నష్టం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయిగూడలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో కోటి రూపాయల ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.