: బాస్ వచ్చేశాడు!.. ప్రారంభమైన ఖైదీ నంబర్ 150 ప్రత్యేక ప్రదర్శన.. అభిమానుల కోలాహలం
ఖైదీ నంబర్ 150.. తెలుగు రాష్ట్రాలను ఇప్పుడీ పేరు ఊపేస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శన అభిమానుల కోలాహలం మధ్య పలుచోట్ల ప్రారంభమైంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, పాలకొల్లుతోపాటు పలు పట్టణాల్లో ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన ప్రారంభమైంది. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో చిరు అభిమానులు థియేటర్ల వద్దకు భారీగా చేరుకున్నారు. బాణసంచా కాలుస్తూ కేరింతలు కొట్టారు. ఏలూరులో చిత్రం ప్రత్యేక ప్రదర్శనను తిలకించేందుకు స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి హాజరయ్యారు. మరికొన్ని గంటల్లో సినిమా టాక్ బయటకు రానుంది.