: లేకపోతేనా.. హీరోగా నా సినిమాల సంఖ్య రెండు వందలకు పైగా ఉండేది!: బాలకృష్ణ
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం, బాలకృష్ణ 100వ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే, చిత్ర రంగంలోకి చిరంజీవి కన్నా ముందుగా బాలకృష్ణే ప్రవేశించారు. కానీ, హీరోగా బాలకృష్ణ నటించిన సినిమాల సంఖ్య వంద మాత్రమే. ఈ విషయమై ఒక న్యూస్ ఛానెల్ లో బాలకృష్ణను ప్రశ్నించగా, ‘1974 నుంచి నేను సినిమాల్లో నటిస్తున్నాను. 1982లో హీరోగా పరిచయమయ్యాను. అయితే, మా నాన్నగారు చదువుకు ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చేవారు. మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలనేవారు. దీంతో, హీరోగా నా సినిమాల సంఖ్య తగ్గింది. లేకపోతేనా, ఈ పాటికి నూటయాభై.. రెండు వందలకు పైగా చిత్రాల్లో హీరోగా చేసే ఉండేవాడిని. అయితే, సినిమాల సంఖ్య ఎన్ని అన్నది కాదు ముఖ్యం. ఎన్ని రకాల పాత్రలు పోషించాము.. ఏ మేరకు ప్రజలను రంజింప చేశాము, ఎంతవరకు వారి మన్ననలు, ఆశీస్సులు పొందాము అనేది ముఖ్యం’ అని బాలకృష్ణ అన్నారు.