: చిరంజీవికి బెస్ట్ విషెస్ చెప్పిన బాలకృష్ణ!


మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవికి ప్రముఖ నటుడు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ  తన విషెస్ తెలిపారు. ఆరోగ్యకరమైన పోటీ అనేది ఉండాలని, ఉంటే... బాగుంటుందని అన్నారు. పోటీ అనేది లేకపోతే వచ్చిన ఫలితం కూడా అంత సంతృప్తిగా ఉండదని అన్నారు. తనదేమో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అని, చిరంజీవిది సాంఘిక చిత్రమని.. రెండు వేర్వేరు జానర్ లకు సంబంధించినవి అన్నారు. అయితే, ఏ సినిమా అయినా బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘ఖైదీ నంబర్ 150’ చిత్రాలు రెండూ బాగుంటే ఆ రెండింటిని ప్రేక్షకులు చూస్తారని అన్నారు. 

  • Loading...

More Telugu News