: ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంట్ సమీపంలో జంట పేలుళ్లు... 70 మంది దుర్మరణం


ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంటు వద్ద జంట పేలుళ్ల సంఘటనలో 70 మంది దుర్మరణం చెందారు. కాబూల్ లోని పార్లమెంటు కార్యాలయాల సమీపంలో ఉగ్రవాదులు జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో ఒకటి ఆత్మాహుతి దాడి కాగా, మరోటి కారు బాంబు దాడి. ఇండియన్ ఫైనాన్స్ డ్ న్యూ పార్లమెంటు భవనం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే కారు బాంబు పేలుడు సంభవించింది. సంఘటనా స్థలం రక్తసిక్తంగా మారింది. పార్లమెంటు భవనాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ప్రాథమిక సమాచారం ప్రకారం 21 మంది మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు.

  • Loading...

More Telugu News