: నా సినీ పయనం నల్లేరుమీద నడక!: చిరంజీవి


1977-78 మధ్య మొదలైన తన సినీ పయనం రాజులాగ నల్లేరుమీద నడకలా సాగిందని ప్రముఖ నటుడు చిరంజీవి తెలిపారు. ఖైదీ నెంబర్ 150 ప్రమోషన్ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తన కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే అద్భుతంగా ఉంటుందని అన్నారు. అయితే సేవచేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. అయితే ఈ పయనం కేక్ వాక్ కాదని, టర్బులెన్స్ అని తాను ముందే ఊహించానని అన్నారు. ఈ పదేళ్ల సుదీర్ఘ రాజకీయ పయనంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని చెప్పారు.

ఈ క్రమంలో మాటలు పడడం, మాటలు అనడం ఎంతో బాధించాయని ఆయన అన్నారు. కొన్నిసార్లు కొంత మందిని విమర్శించాల్సి వస్తుందని, అలాంటప్పుడు మనసుని చంపుకుని అలా మాట్లాడాల్సి వస్తుందని ఆయన అన్నారు. అయితే అధికారం వచ్చిన తరువాత నిజాయతీగా సేవ చేస్తే వచ్చే ఆనందం ముందు ఇవేవీ పెద్ద విషయాలు కాదని ఆయన అన్నారు. తాను ఆ ఆనందాన్ని తిరుపతి ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా చాలా సార్లు అనుభవించానని ఆయన తెలిపారు. ఆ తరువాత జరిగిన రాష్ట్ర విభజన పెద్ద కుదుపు అని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News