: నిద్ర సమస్యతో శ్రుతిహాసన్ సతమతం అవుతోందట!


తనకు నిద్రపట్టకుండా చేసే తన పాత స్నేహితుడు మళ్లీ వచ్చేశాడంటోంది దక్షిణాది ముద్దుగుమ్మ శ్రుతిహాసన్. ఇంతకీ, ఆమెను అంతలా నిద్రకు దూరం చేస్తున్న ఆ ఫ్రెండ్ మరెవరో కాదు.. ‘జెట్ ల్యాగ్’! అవును... శ్రుతి ఎప్పుడు విమానంలో దూర ప్రయాణం చేసినా తీవ్ర జెట్ ల్యాగ్ తో బాధపడుతుంటుందట. మొన్నటి వరకు దీని బాధ తగ్గిందనుకుంటే, మళ్లీ మొదలైందని, తనను నిద్ర పోనీయకుండా చేయడానికే ఈ పాత స్నేహితుడు వచ్చాడని శ్రుతి తన ట్విట్టర్ ఖాతాలో చమత్కరించింది. కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన కాటమరాయుడు చిత్రంలో నటిస్తోంది.

  • Loading...

More Telugu News