: నా భూమే కబ్జాకి గురైంది: అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్
పెందుర్తిలో ప్రహరీని పడగొట్టి మరీ తన స్థలాన్ని కబ్జా చేశారని సౌదీ అరేబియా నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ పై ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పీలా గోవింద్ మాట్లాడుతూ, వాస్తవానికి తన స్థలమే కబ్జాకి గురైందని అన్నారు. దీనిపై గతంలో ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిని పోలీసులు పర్యవేక్షిస్తున్నందువల్ల వారేం తేలుస్తారో చూడాలని ఆయన తెలిపారు. సర్వే నెంబర్ భూమి పట్టాల ఆధారంగా వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆయన చెప్పారు. దీనిపై ఎమ్మార్వో మాట్లాడుతూ, గతంలోనే ఈ వివాదంపై సర్వే చేశామని అన్నారు. ఆ వివరాలు పోలీసులకు అందిస్తామని ఆయన తెలిపారు.