: జల్లికట్టు, బుల్ ఫైట్ పై ఇప్పుడే చెప్పలేం: కేంద్ర మంత్రి అనిల్ దవే
తమిళనాడు సాంప్రదాయక క్రీడ జల్లికట్టు, మహారాష్ట్ర బుల్ ఫైట్ గురించి తమ నిర్ణయం ఇప్పుడే ఏమీ చెప్పలేమని కేంద్ర మంత్రి అనిల్ దవే స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వీటికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున తీర్పు కోసం వేచి చూస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏపీలో కోడి పందేల నిర్వహణ అంశం గురించీ ఆయన ప్రస్తావించారు. ఈ అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని చెప్పారు. కుక్కల పెంపకం, నిర్వహణపై 1960 చట్టంలో సవరణలు చేస్తున్నామని, దీని ప్రకారం, శునకాలను పెంచుకునేవారు పశుసంక్షేమ మండలిలో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని అనిల్ దవే పేర్కొన్నారు.