: పిచ్ మధ్యలోకి దూసుకొచ్చిన అభిమాని... పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చిన ధోనీ!


ముంబైలో ఇండియా-ఏ, ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆట మధ్యలో ధోనీ అభిమాని ఒకరు... స్టాండ్స్ నుంచి దూకి, పిచ్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది, అతన్ని పట్టుకునేందుకు పరిగెత్తుతూ వచ్చారు. అయితే, తనకు కొంచెం దూరం వరకు వచ్చిన అభిమానిని దగ్గరకు పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ధోనీ. దీంతో ఎంతో సంతోషానికి గురైన అతను, ధోనీ కాళ్లను టచ్ చేశాడు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది అతడిని తీసుకుని గ్రౌండ్ వెలుపలకు తీసుకుపోయారు. 

  • Loading...

More Telugu News