: మేకప్ వేసుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ..: సోనమ్ కపూర్
మేకప్ తీసేయాలన్నా, వస్త్రాలు మార్చుకోవాలన్న తనకు చాలా చిరాకుగా ఉంటుందని బాలీవుడ్ ప్రముఖ నటి సోనమ్ కపూర్ చెప్పింది. నిన్న రాత్రి నిర్వహించిన 62 జియో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రీ పార్టీకి సోనమ్ నలుపు రంగు గౌనులో హాజరైంది. ఈ సందర్భంగా సోనమ్ తన ఇష్టాయిష్టాల గురించి మీడియాతో మాట్లాడుతూ, ఏదైనా పార్టీకి వెళ్లేటప్పుడు మేకప్ వేసుకోవడం, మంచి డ్రెస్ వేసుకుని తయారవటం బాగానే ఉంటుంది కానీ, ఆ మేకప్ తీసేయాలి, ఆ వస్త్రాలు మార్చుకోవాలంటేనే చాలా చిరాకుగా ఉంటుందని చెప్పుకొచ్చింది. కాగా, ఈ పార్టీలో బాలీవుడ్ ప్రముఖులు శ్రీదేవి, షారూక్ ఖాన్, కరణ్ జొహార్, తమన్నా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.