: పేరు మార్చుకుంటానన్న మంచు లక్ష్మి!
మంచువారమ్మాయి లక్ష్మి మంచు నటిగా, నిర్మాతగా, బుల్లి తెర యాంకర్ గా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఆమెను అభిమానించే వారు కూడా ఎక్కువే. ఆమె తండ్రి మీద ఉన్న గౌరవమో లేక ఆమె మీద ఉన్న అభిమానమో కానీ చాలామంది లక్ష్మిని 'అక్క' అని సంబోధిస్తున్నారట. ఎవరు అక్కా అని పిలిచినా ఇంతకాలం పట్టించుకోని మంచు లక్ష్మి... గత వారం మాత్రం చాలా చికాకు పడిందట. ఓ పళ్లు లేని ముసలాయన కూడా తనను అక్క అని పిలిచాడని... అందుకే తన పేరును అక్క అని మార్చుకోవాలనుకుంటున్నానని అంటూ ట్వీట్ చేసింది. అక్కా తొక్కా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు అక్క అనే పిలుపు తనకు ఎంత చికాకు తెప్పిస్తోందో రకరకాల ఎమోజీలతో సూచించింది. మరి ఇప్పటికైనా మంచు లక్ష్మి బాధను అర్థం చేసుకుని... అక్క అని పిలవడం మానేస్తారేమో వేచి చూడాలి.
I'm seriously contemplating to changing my name to AKKA after an old man(w no teeth) over the weekend called me that.