: ‘కన్నడ’ జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతి!
కన్నడ జూనియర్ ఆర్టిస్ట్ పద్మావతి (44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళంలో విజయవంతమైన ‘వీఐపీ’ సినిమాను కన్నడలో రీమేక్ చేస్తున్నారు. యలహంక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో డ్యాన్స్ సీక్వెన్స్ ను నిన్న చిత్రీకరించారు. ఈ సందర్భంగా 120 మంది జూనియర్ ఆర్టిస్టులతో జరిపిన షూటింగ్ లో పద్మావతి కూడా పాల్గొంది. అయితే, షూటింగ్ ముగిసిన అనంతరం, చిత్ర బృందం అక్కడి నుంచి వెళ్లే సమయంలో పద్మావతి కనిపించకపోవడాన్ని ఓ ఆర్టిస్ట్ గుర్తించారు. ఈ క్రమంలో ఆమె కోసం అక్కడ వెతకగా, రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లోని లిఫ్ట్ గుంతలో పద్మావతి మృతదేహాం ఉండటాన్ని గుర్తించారు.