: నేను పొలిటీషియన్ కాదు... రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదు: నటుడు అర్జున్ రాంపాల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈరోజు ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరుతున్నారా? అంటూ రాంపాల్ ను మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా తాను రాజకీయవేత్తను కాదని, రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని చెప్పాడు. అయితే, బీజేపీకి తనవంతు సహకారమందించే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చానని తెలిపాడు. మరోవైపు, అర్జున్ రాంపాల్ తో పాటు, మరో నటుడు జాకీ ష్రాఫ్ కూడా బీజేపీలో చేరబోతున్నారని... యూపీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, ఈరోజు రాంపాల్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని కలిశాడు.