: కోస్తాలో పడ్డ వర్షాలు... వైసీపీ గెలిచిన రాయలసీమలో మాత్రం కురవలేదు: కేఈ
దేశ వ్యాప్తంగా కరవు సంభవిస్తే... ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే రాష్ట్రంలో వర్షాలు కురవలేదంటూ వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానిస్తుండటం అతని అజ్ఞానాన్ని సూచిస్తోందంటూ ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. జగన్ ఓ అజ్ఞానిలా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. కోస్త్రాంధ్ర జిల్లాల్లో సమృద్దిగా వర్షాలు కురిశాయని... వైసీపీ గెలిచిన రాయలసీమలో మాత్రం కురవలేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తల్లి, పిల్ల కాంగ్రెస్ లకు కనిపించడం లేదంటూ ఆయన మండిపడ్డారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎన్ని శంకుస్థాపనలు చేశారో? ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేశారో? వెల్లడించాలంటూ సవాల్ విసిరారు.