: రాహుల్ గాంధీ వచ్చేశాడోచ్...!


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. విదేశాల్లో సుదీర్ఘ విశ్రాంతిని పొందిన అనంతరం నిన్న అర్ధరాత్రి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం అందరికన్నా ముందుగా సోనియాగాంధీ తన కుమారుడి నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ప్రియాంకగాంధీ అక్కడకు చేరుకున్నారు.
గత నెల గుట్టుచప్పుడు కాకుండా రాహుల్ విదేశాలకు వెళ్లారు. డిసెంబర్ 31న ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే, ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆయన భారత్ కు తిరిగి వస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన మాత్రం పూర్తి స్థాయిలో విశ్రాంతిని తీసుకున్న తర్వాత వచ్చారు. ఈ ఉదయం రాహుల్ తో సోనియా, ప్రియాంకలు కీలక చర్చలు జరిపినట్టు సమాచారం. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ తో తాను జరిపిన చర్చల సారాంశాన్ని రాహుల్ గాంధీకి ప్రియాంక వివరించినట్టు సమాచారం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎస్పీతో పొత్తుకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అఖిలేష్ కు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News