: చైనా ఆక్రమణతో భయమేం లేదు: ఖుర్షీద్
జమ్మూ కాశ్మీర్ లోని లడక్ ప్రాంతంలో చైనా సైనికులు చొరబడినప్పటికీ భయపడాల్సినంత అవసరం ఏమీ లేదని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానల్ తో మాట్లాడారు. "ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. వాస్తవానికి చైనా సైనికుల నుంచి ప్రతిఘటనేమీ లేదు. మేం ఆందోళన వ్యక్తం చేశాం. ఈ సమస్యను పరిష్కరించుకోగలం. చైనా దళాలు 19 కిలోమీటర్ల మేర లోపలకు వచ్చాయి. వారికి సరఫరా మార్గాలను మూసివేయగలం. కానీ ఇది సరికాదు. దీనిని పరిష్కరించుకోవాల్సి ఉంది" అని చెప్పారు. పరాయి దేశ సైనికులు ధైర్యంగా 19 కిలోమీటర్ల మేర వచ్చి పాగా వేస్తే భయపడాల్సిందేమీ లేదని చెప్పడం మంత్రిగారికే చెల్లింది!