: బొద్దింకను వీడియో తీసేందుకు శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసిన డాక్టర్!


ఆపరేషన్ థియేటర్ లోకి ఓ బొద్దింక రాగా, దాన్ని వీడియో తీసేందుకు.. తాను చేస్తున్న శస్త్రచికిత్సను మధ్యలో నిలిపేశారో డాక్టర్. ఈ ఘటన థానేలో జరిగింది. ఈ ప్రాంతంలో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా పేరున్న ఛత్రపతి శివాజీ మహరాజ్ హాస్పిటల్ లో నిత్యమూ ఎన్నో శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. పరిశుభ్రతలో అత్యంత అధిక స్టాండర్డ్స్ పాటించాల్సిన ఆసుపత్రి వాతావరణం, పలు రకాల పురుగులకు, బొద్దింకలకు ఆలవాలమైంది.

ఈ విషయం ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. దీనిపై ఆగ్రహంతో ఉన్న ఓ డాక్టర్ ఈ పని చేశారు. సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న సంజయ్ బరాన్ వాల్, ఆపరేషన్ చేస్తున్న వేళ, బొద్దింక అక్కడే తిరుగాడటం గమనించారు. చెదలు, బొద్దింకల సమస్యలపై ఇప్పటికే ఎన్నోమార్లు అధికారులకు చెప్పినా, ఫలితం లేకపోవడంతో, బొద్దింకల స్వైర విహారంపై వీడియో తీసి వారికి ఇవ్వడం ద్వారా ఇప్పటికైనా చర్యలు చేపడతారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News