: మాది చెత్త సంస్థ కాదు... చెత్త రికార్డుపై స్పందించిన ఎయిర్ ఇండియా
ప్రపంచంలోని అతి చెత్త విమానయాన సంస్థల్లో ఎయిర్ ఇండియాకు మూడో ర్యాంకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్లైట్ స్టాట్స్ ఈ జాబితాను విడుదల చేసింది. సరైన సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం లేదంటూ తన నివేదికలో ఫ్లైట్ స్టాట్స్ పేర్కొంది. దీనిపై ఎయిర్ ఇండియా సందిస్తూ, తమది చెత్త సంస్థ కాదని తెలిపింది. ఈ రిపోర్టు ఒక కల్పితమనే విషయాన్ని తాము గుర్తించామని... దీనిపై ఎయిర్ ఇండియా మేనేజ్ మెంట్ విచారణ చేపడుతుందని ఆ సంస్థ అధికార ప్రతినిధి ధనుంజయ్ కుమార్ తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా ఆన్ టైమ్ పర్ఫామెన్స్ సర్వీసెస్ అందిస్తున్న సంస్థగా తాము పేరుగాంచామని.... బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా అవార్డులు పొందామని ఆయన అన్నారు.