: గంగూలీపై రవిశాస్త్రి నిర్ణయాన్ని వ్యతిరేకించిన ముత్తయ్య మురళీధరన్


ఇండియాలోని టాప్ క్రికెట్ కెప్టెన్ల పేర్లను ప్రకటిస్తూ, అందులో సౌరవ్ గంగూలీ పేరును చేర్చని రవిశాస్త్రి వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కూడా చేరాడు. ఆల్ టైం బెస్ట్ కెప్టెన్ లంటూ, కపిల్ దేవ్, అజిత్ వాడేకర్, టైగర్ పటౌడీ, ధోనీ పేర్లను రవిశాస్త్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.

అతని జాబితా నుంచి సౌరవ్ గంగూలీ పేరు మిస్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ముత్తయ్య అన్నాడు. భారత క్రికెట్ కు అతనెంతో చేశాడని, గొప్ప కెప్టెన్ లలో అతనూ ఉంటాడన్నది తన అభిప్రాయమని చెప్పాడు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, వాటిని గౌరవించాల్సిందేనని కూడా చెప్పాడు. కాగా, ఇటీవలి కాలంలో రవిశాస్త్రి, గంగూలీల మధ్య విభేదాలు పెరిగినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News