: సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా
సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ పరీక్షా తేదీల్లోనే జరగనున్నందున, వీటిని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు బోర్డు అధికారులు వెల్లడించారు. మారిన షెడ్యూల్ ప్రకారం, పరీక్షలు మార్చి 9 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. టెన్త్ విద్యార్థులకు ఏప్రిల్ 10 వరకూ, ఇంటర్ వారికి ఏప్రిల్ 29 వరకూ పరీక్షలు ఉంటాయని సీబీఎస్ఈ ఓ ప్రకటనలో వెల్లడించింది. జేఈఈ (జాయింట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్)కు ప్రిపేర్ అవుతున్న వారితో పాటు నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు హాజరయ్యే వారికి, ఆయా పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు పేర్కొంది.