: ఛత్తీస్‌గఢ్‌లో కాల్పుల మోత... నలుగురు మావోయిస్టులు, ఒక జవాను మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. అక్కడి పోలీసులు, జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో ఒక జవాను కూడా మృతి చెందాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో భద్రతా దళాలు కూబింగ్ నిర్వహిస్తోన్న సమయంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో బలగాలు ఇంకా కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.