: 2016 హాటెస్ట్ కీ వర్డ్స్ ఇవిగో..!
గత సంవత్సరం స్మార్ట్ ఫోన్ వాడకందారులు అత్యధికంగా శోధించిన పదాల గురించిన వివరాలను అలీబాబా గ్రూప్ అందిస్తున్న బ్రౌజర్ బ్రాండ్ యూసీ న్యూస్ వెల్లడించింది. ఉచిత 4జీ సేవలంటూ ముందుకొచ్చిన రిలయన్స్ జియో హాటెస్ట్ కీ వర్డ్ గా నిలిచిందని, ఈ పదాన్ని 11.60 కోట్ల మంది వెతికారని పేర్కొంది. ఆపై క్రికెటర్ విరాట్ కోహ్లీ 10.80 కోట్లతో, సల్మాన్ ఖాన్ 6.4 కోట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆంగ్ల పాఠకులు అత్యధికంగా ప్రియాంకా చోప్రా గురించి వెతుకగా, హిందీ పాఠకులు అత్యధికంగా కరీనా కపూర్ గురించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆసక్తిని చూపారని పేర్కొంది.