: పేరు మార్చుకున్న 'యాహూ'.. కొత్త పేరు 'ఆల్టాబ్'!


గడచిన రెండు దశాబ్దాలుగా ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా వెలుగుతున్న యాహూ తన పేరు మార్చుకోనున్నట్టు ప్రకటించింది. కొత్త పేరు 'ఆల్టాబ్' అని, యాహూ ఐఎన్సీ, ఇక ఆల్టాబ్ ఐఎన్సీగా రూపాంతరం చెందనున్నట్టు వెల్లడించింది. వేరిజోన్ కమ్యూనికేషన్ తో కుదిరిన డీల్ ముగిసిన తదుపరి, యాహూ సీఈఓ మెరిస్సా మేయర్ రాజీనామా చేయనున్నారని పేర్కొంది. మొత్తం రూ. 32,491 కోట్లకు (4.83 బిలియన్ డాలర్లు) యాహూ, తన వ్యాపారంలోని ముఖ్య విభాగాలైన డిజిటల్ అడ్వర్టయిజింగ్, ఈ-మెయిల్, మీడియా విభాగాలను వేరిజోన్ కు గత సంవత్సరంలో విక్రయించిన సంగతి తెలిసిందే.

కాగా, రాజీనామా చేసినప్పటికీ మెరిస్సా మేయర్, యాహూలోనే కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఐదుగురు డైరెక్టర్లు కూడా రిజైన్ చేస్తారని మంగళవారం నాడు యాహూ, తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. సంస్థ కొత్త చైర్మన్ గా ఎరిక్ బ్రాండ్జ్ ను నియమించినట్టు తెలియజేసింది. యాహూ, వేరీజోన్ మధ్య విలీన ఒప్పందం కుదిరిన తరువాత, రెండుసార్లు డేటా చోరీ జరిగింది. మొత్తం 150 కోట్లకు పైగా యూహూ మెయిల్ అకౌంట్లు చోరీకి గురయ్యాయి.

  • Loading...

More Telugu News