: ఐసిస్ మరో ఘాతుకం.. మాటలు కూడా సరిగా రాని బాలుడితో బందీని చంపించి పైశాచిక ఆనందం.. వీడియోను విడుదల చేసిన ఉగ్రసంస్థ
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. బందీలను పట్టుకుని వారిని నిర్దాక్షిణ్యంగా తలలు తెగనరికి చంపుతూ ఆ వీడియోలను పోస్టు చేస్తున్న ఐసిస్ తాజాగా ఒళ్లు జలదరించే మరో వీడియోను పోస్టు చేసింది. మాటలు కూడా సరిగా పలకలేని బాలుడితో బందీని చంపించింది.
ఎర్రగా ఉన్న ఓ చిన్నారి మొహంలో సీరియస్‌నెస్ కనిపిస్తుండగా నడిచి వచ్చి ఎదురుగా ఉన్న బాల్‌పిట్‌లోకి దూరాడు. అక్కడ ఓ ఉగ్రవాది ఇచ్చిన లోడ్ చేసిన గన్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. దానిని ఎదురుగా ఫెన్సింగ్‌కు బంధించి ఉంచిన బందీపై గురిపెట్టాడు. వెంటనే ట్రిగ్గర్ నొక్కాడు. అంతే.. బందీ తలలోంచి తూటా దూసుకుపోయింది. అతడు తలవాల్చేశాడు. ఈ వీడియోను చూసిన ప్రపంచం నివ్వెరపోయింది.