: నా స్నేహితులు చిరంజీవి, బాలకృష్లల సినిమాలు చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: వెంకటేష్


ఈసారి సంక్రాంతి తెలుగువారింట మరింత ఘనంగా జరుగుతుందని ప్రముఖ సినీ నటుడు వెంకటేష్ తెలిపారు. తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా సంక్రాంతి సినిమాల గురించి పోస్టు చేసిన వెంకటేష్, తన ఇద్దరు స్నేహితుల సినిమాలు చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ‘ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాలు. ఇద్దరూ మహానటులు, నాకు మంచి స్నేహితులు. రాబోతున్న పెద్ద పండుగ. ఈ సంక్రాంతిని మనం మరింత సంతోషంతో, సంబరాలతో జరుపుకోవడానికి ఓ కారణం ఉంది. ఈ రెండు చిత్రబృందాలకు ఆల్‌ ది బెస్ట్‌. చిరు, బాలయ్యలను వెండితెరపై చూడటానికి ఇంకేమాత్రం ఆగలేను’ అని పేర్కొన్నారు. ముగ్గురూ కలిసి ఓసినిమా ప్రారంభోత్సవం సందర్భంగా దిగిన ఫోటోను తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో వెంకటేష్ పోస్టు చేశారు. 

  • Loading...

More Telugu News