: మా అన్నయ్య మోహన్ బాబు చాలా హార్డ్ వర్కర్!: కోన వెంకట్
'మా అన్నయ్య మోహన్ బాబు చాలా హార్డ్ వర్కర్. ఆయన మనసు వెన్న' అన్నారు ప్రముఖ రచయిత కోన వెంకట్. హైదరాబాదులో జరుగుతున్న 'లక్కున్నోడు' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఎంవీవీ బిల్డర్స్ అధినేత పట్టిందల్లా బంగారమేనని, ఆయనను లక్కున్నోడని అనవచ్చని అన్నారు. 'మా బ్రదర్ విష్ణు హార్డ్ వర్కర్' అని చెప్పారు. బ్రదర్ విష్ణుతోనే తన కెరీర్ ఫలప్రదమైందని అన్నారు. తన కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన 'ఢీ' సినిమాలో బ్రదర్ విష్ణు అద్భుతంగా నటించడంతో తన మాటలు పండాయని చెప్పారు. ఆ తరువాత 'రెఢీ' తనను పరిశ్రమలో నిలబెట్టిందని కోన వెంకట్ చెప్పారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజ్ కిరణ్ కు లక్కు కలిసిరావాలని ఆయన ఆకాంక్షించారు.