: మోహన్ బాబు ఎదురుగా ఉంటే మాట్లాడలేము!: పరుచూరి గోపాలకృష్ణ


అన్నగారు ఎదురుగా ఉంటే ఎలా మాట్లాడలేమో మోహన్ బాబు ఎదురుగా ఉన్నా మాట్లాడలేమని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. హైదరాబాదులో జరిగిన 'లక్కున్నోడు' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, సినిమా నిర్మాణం ద్వారా మోహన్ బాబు కుటుంబం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందని, అలాంటి కుటుంబం ఆనందంగా ఉండాలని అన్నారు. విష్ణు ఈ సినిమాలో అద్భుతంగా నటించాడని ఆయన అన్నారు. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని ఆయన ఆకాంక్షించారు. మంచి కథాకథనాలు కుదిరాయని ఆయన చెప్పారు. ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News