: మీ నాన్న మొండిఘటం... తాత సరదాగా అన్న మాటలను అఖిలేష్ కు చెప్పిన కూతురు!


సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) లో రాజకీయ సంక్షోభం ఇంకా ఒక కొలిక్కిరాని విషయం తెలిసిందే. అయితే, తండ్రీకొడుకులు ములాయం, అఖిలేష్ యాదవ్ ల మధ్య విభేదాలను మాత్రం వారి కుటుంబసభ్యులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పడానికి ఇటీవల జరిగిన ఒక సంఘటనే నిదర్శనం. అఖిలేష్ యాదవ్ కుమార్తెలు అదితి, టీనాలు తన తాతయ్య ములాయంసింగ్ ఇంటికి వెళ్లారట. మనవరాళ్లతో సరదాగా గడిపిన ములాయం, ‘మీ నాన్న మొండిఘటం’ అని టీనాతో అన్నారట. తాత అన్న మాటలను టీనా తన తండ్రి చెవిలో ఊదిందట. ‘అవును, నేను మొండిఘటాన్నే’ అని టీనాతో అఖిలేష్ నవ్వుతూ చెప్పారట. 

  • Loading...

More Telugu News