: ధోనీ, నేను భయమన్నదే లేకుండా ఆడుతాం!: యువరాజ్ సింగ్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో తనకు ఒక విషయంలో సారూప్యత ఉందని, అదేమిటంటే, తామిద్దరం భయమన్నదే లేకుండా ఆడుతామని వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ అన్నాడు. ధోనీ కెప్టెన్సీపై యువీ మాట్లాడుతూ, త్వరలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ధోనీ కెప్టెన్సీని వదులుకున్నాడని అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి అవకాశం ఇవ్వాలని భావించే ధోనీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని యువీ చెప్పాడు. విరాట్ లో కెప్టెన్సీ లక్షణాలు ఉన్నాయని మహీ భావించి ఉంటాడని యువీ తెలిపాడు. కెప్టెన్ గా ధోనీ తిరుగులేని వ్యక్తి అని యువీ చెప్పాడు. వన్డే, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు.. ఇలా ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు అద్వితీయమైన విజయాలు సాధించిందని చెప్పాడు. ధోనీ కెప్టెన్సీకి రాజీనామా చేసినప్పటికీ కోహ్లీకి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తాడని యువీ అభిప్రాయపడ్డాడు.