: ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఒక్కో సమయంలో ఒక్కోలా మాట్లాడుతున్నారు : చిరంజీవి విమర్శలు
ఇకపై సినిమాలు, రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూనే ముందుకు వెళతానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చేయలేనని అన్నారు. ఆ పని అధికార తెలుగుదేశం పార్టీ చేయాలని అన్నారు. చంద్రబాబు ఒక్కో సమయంలో హోదా రావాలని అంటున్నారని, ఒక్కోసారి హోదా ఏమయినా సంజీవినియా? లాభం ఏంటీ? అని అంటున్నారని ఆయన విమర్శించారు. హోదాను ఆయనే నీరు గారుస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వం హోదా కోసం ప్రయత్నిస్తే వారితో పాటు తాము కూడా పోరాడతామని, మద్దతు ఇస్తామని చిరంజీవి అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి ఉండాలని తాను అనుకోవట్లేదని చెప్పారు. పవన్‌ది, తనది గమ్యం ఒక్కటే గానీ, మార్గాలు వేరని చెప్పారు. ఇద్దరం కలిసి ఎన్నికల్లో పనిచేస్తామని తాను ఏ మాత్రం అనుకోవడం లేదని చెప్పారు.