: 'దంగల్', 'సుల్తాన్', 'చక్ దే ఇండియా' సూపర్... అయితే నానుంచి ప్రేక్షకులు అలాంటివి ఆశించరు!: చిరంజీవి


అమీర్ ఖాన్ నటించిన 'దంగల్', సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్', షారూఖ్ ఖాన్ నటించిన 'చక్ దే ఇండియా' వంటి సినిమాలు అద్భుతంగా ఉన్నాయని చిరంజీవి తెలిపారు. అయితే అలాంటి సినిమాలు తాను చేస్తే అభిమానులు చూడరని ఆయన అన్నారు. తన సినిమాలలో అభిమానులు ఆశించే అంశాలు చాలా ఉంటాయని, వారిని ఆనందపరచాలంటే తాను కమర్షియల్ సినిమాలే చేయాలని, అందుకే అలాంటి సినిమాలు చేసే అవకాశం లేదని ఆయన తేల్చిచెప్పారు. అయితే తన సినిమాల్లో కమర్షియల్ హంగులు ఉండేలా చూస్తూనే సందేశమిచ్చే ప్రయత్నం చేస్తానని, అందుకు నిదర్శనంగా 'స్టాలిన్', 'ఠాగూర్' వంటి సినిమాలని గతంలో చేశానని ఆయన తెలిపారు. 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో కూడా అద్భుతమైన సందేశం ఉందని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News