: తెలియని ఒత్తిడి ఉంది...పునరాగమనం ఉత్సాహాన్నిచ్చింది: చిరంజీవి
పదేళ్లు రాజకీయ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ తనలో ఏదో తెలియని ఒత్తిడి ఉండేదని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తెలిపారు. ఇన్నేళ్ల తరువాత సినిమాలో నటించడం ఆనందంగా ఉందని అన్నారు. సినిమాల్లోకి పునరాగమనం చేయడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని ఆయన తెలిపారు. తెలుగులో మంచి కథనిచ్చే రచయిత తమకు దొరకలేదని ఆయన చెప్పారు. మాస్ మసాలాతో మంచి సందేశాన్నిచ్చే సినిమా కత్తి అని, ఈ సినిమా తనకు సరిగ్గా సూట్ అవుతుందని భావించి, దీనిని 150వ సినిమాగా ఎంచుకున్నానని ఆయన తెలిపారు.