: కొంతమంది బయటకు చెప్పుకోలేరు..కానీ, నేను చెబుతున్నాను!: ఆర్. నారాయణమూర్తి


చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనే బాధను కొంతమంది నిర్మాతలు బయటకు చెప్పుకోలేరని, కానీ, తాను మాత్రం ఓపెన్ గా చెప్పేస్తున్నానని ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆయన నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఒక న్యూస్ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులున్నాయని, కొంతమంది ప్రొడ్యూసర్ల చేతుల్లో థియేటర్లు ఉండటంతో ఈ పరిస్థితి నెలకొందని అన్నారు.

పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలలో ఇటువంటి పరిస్థితులు లేవని, అక్కడ చిన్న, పెద్దా సినిమా అనే తేడా లేకుండా, ప్రతి సినిమాకు థియేటర్లు లభిస్తాయని అన్నారు. అటువంటి పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలని కోరుకుంటున్నానని నారాయణ మూర్తి పేర్కొన్నారు. ఈ చిత్రంలో జయసుధతో కలిసి నటించడంపై ఆయన మాట్లాడుతూ, మహానటి సావిత్రి తర్వాత అంత గొప్పనటి జయసుధ అని, ఎంతో మందిగొప్ప నటులతో కలిసి ఆమె నటించారని, అటువంటి గొప్ప మహానటితో కలిసి ఈ చిత్రంలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News