: అప్పుడూ ఇప్పుడూ వారిద్దరి మధ్య వారధినే!: ఆజంఖాన్
అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా సరే సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య తాను వారధిని మాత్రమేనని ఆ రాష్ట్ర మంత్రి ఆజం ఖాన్ తెలిపారు. లక్నోలో ఆయన మాట్లాడుతూ, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మధ్య మంచుమేఘాలు కమ్ముకున్నాయని, అయితే వారిద్దరి మధ్య గాఢాంధకారం అలముకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ములాయం, అఖిలేష్ మధ్య వివాదం నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహించిన ఆజంఖాన్ సానుకూల ఫలితాలు సాధించారని, వారిద్దరి మధ్య రాజీ కుదిర్చారని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే.