: చెత్త ఎయిర్ లైన్స్ లిస్టులో ఎయిర్ ఇండియా
మన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ కంపెనీల్లో ఎయిర్ ఇండియా మూడో స్థానంలో నిలిచి, మనం సిగ్గుపడేలా చేసింది. 2016 ఏడాదికి గాను ఫ్లైట్ స్టాట్స్ ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 500 వర్గాల నుంచి సమాచారం సేకరించి ఈ జాబితా తయారు చేశామని ఫ్లైట్ స్టాట్స్ తెలిపింది. పొజిషనల్ సర్వీసెస్, ఫ్లైట్ ట్రాకింగ్, రన్ వే టైమ్స్, రాడార్ సర్వీసెస్, ఎయిర్ లైన్ రికార్డ్స్, ఎయిర్ పోర్ట్ డేటా తదితర విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్టు చెప్పింది. విమానాలు తరచుగా ఆలస్యం కావడం, రద్దవడం ఎక్కువగా ఉంటే వాటిని చెత్త ఎయిర్ లైన్స్ గా గుర్తిస్తారు.
టాప్ 10 చెత్త ఎయిర్ లైన్స్ ఇవే...
- ఈఐ ఏఐ ఐలండ్
- ఐలండ్ ఎయిర్
- ఎయిర్ ఇండియా
- ఫిలిప్పైన్స్ ఎయిర్ లైన్స్
- ఏషియానా ఎయిర్ లైన్స్
- చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్
- హాంకాంగ్ ఎయిర్ లైన్స్
- ఎయిర్ చైనా
- కొరియన్ ఎయిర్
- హైనన్ ఎయిర్ లైన్స్