: వరుణ్.. మీ నాన్న సలహాలు వినొద్దు.. చిరంజీవి గారి నుంచి నేర్చుకో: దర్శకుడు వర్మ
మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’వ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు వర్మ చేస్తున్న విమర్శల ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా, నాగబాబు కొడుకు, యువ హీరో వరుణ్ తేజ్ కు వర్మ ఒక సలహా ఇచ్చాడు. ‘వరుణ్ తేజ్.. నువ్వు మీ నాన్న సలహాలు పాటిస్తే, ఆయనలాగే జబర్దస్త్ లేకుండా తయారవుతావు. మీ తండ్రిని చిరంజీవి గారు నమ్మి పొరపాటు పడినట్లు.. నువ్వు పొరపాటు పడొద్దు’ అని వర్మ తన ట్వీట్లలో పేర్కొన్నారు.