: ఐశ్వర్య కూతురు, అమీర్ ఖాన్ కొడుకు కలిసి డ్యాన్స్!
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కొడుకు ఆజాద్ రావ్ ఖాన్ , ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య కలిసి ఒక పాటకు డ్యాన్స్ చేశారు. ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో వాళ్లిద్దరూ చదువుకుంటున్నారు. పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘రైల్ గాడీ’ అనే పాటకు ఈ చిన్నారులిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోకి చేరి వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమానికి ఆ పాఠశాల చైర్ పర్సన్ నీతా అంబానీ, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ దంపతులు, అమీర్ ఖాన్ హాజరయ్యారు. చిన్నారుల ప్రదర్శన చూస్తూ చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహించారు.