: నోబెల్ ప్రైజ్ అంటే ఏమిటో చంద్రబాబుకు తెలుసా?: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి


నోబెల్ ప్రైజ్ సాధించిన వారికి రూ. 100 కోట్లు ఇస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. అసలు నోబెల్ ప్రైజ్ అంటే ఏంటో చంద్రబాబుకు తెలుసా? అని ప్రశ్నించారు. ఓ వైపు ఉపాధ్యాయులను తీసివేసేందుకు కుట్రలు పన్నుతూ, విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, మరోవైపు నోబెల్ ప్రైజ్ గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. నారాయణ, శ్రీచైతన్య విద్యాలయాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. విద్యార్థి సంఘాలు కూడా ఈ విషయంపై మాట్లాడాలని సూచించారు. చంద్రబాబుకు మంత్రి నారాయణ బినామీ అని... నారాయణకు నారాయణ విద్యాసంస్థలు బినామీ అని ఆరోపించారు. అందుకే ఈ ఆత్మహత్యల గురించి ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News