arujaitly: పరోక్ష పన్నుల ద్వారా 25 శాతం ఆదాయం పెరిగింది!: అరుణ్‌జైట్లీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్వీస్ ట్యాక్స్ డేటాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు పెరిగాయని చెప్పారు. గత ఏడాది ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్) ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు పరోక్ష పన్నుల ద్వారా 25 శాతం ఆదాయం అధికమయిందని, ఆ కాల వ్యవధిలో ప్రత్యక్ష పన్ను 121 శాతం వృధ్ధి సాధించినట్లు పేర్కొన్నారు. గతనెల ఎక్సైజ్ డ్యూటీ 31.5 శాతం అదనంగా వసూలైందని మీడియాకు వివరించి చెప్పారు.