: మంత్రి జోగు రామన్న కుమారుడిపై హత్య కేసు!


తెలంగాణ మంత్రి జోగు రామన్న కుమారుడు ప్రేమ్ చంద్ పై హత్య కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం లక్ష్మీపూర్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త తిరుపతిరెడ్డి హత్య కేసులో ప్రేమ్ చంద్ హస్తం ఉందని మృతుని కుటుంబీకులు ఆరోపించారు. అతనితో పాటు మరికొందరు టీఆర్ఎస్ కార్యకర్తలపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, ప్రేమ్ చంద్ తో పాటు మరో తొమ్మిది మంది టీఆర్ఎస్ కార్యకర్తలపై సెక్షన్ 302 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో నెలకొన్న ఆధిపత్య పోరు వల్లే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News