: జన్మభూమి కార్యక్రమంలో రసాభాస... టీడీపీ, సీపీఐ కార్యకర్తల మధ్య తోపులాట


కడప జిల్లాలోని పోరుమామిళ్లలో నిర్వ‌హించిన‌ జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్త‌ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్న ఎమ్మెల్యే జయరాములుతో సీపీఐ నాయకులు వాగ్వివాదానికి దిగారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించాల్సిందేనంటూ గందరగోళం సృష్టించారు. దీంతో టీడీపీ, సీపీఐ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఘర్షణకు దిగిన కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

  • Loading...

More Telugu News