: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
తెలంగాణ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విభజన చట్టంలోని సెక్షన్ 89ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. కృష్ణానది జలాలను పరీవాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు పిటిషన్ ను కొట్టి వేసింది.